టెక్కీని హత్య చేసిన బావ, భార్య అతని వద్ద ఉందనే

అందిన వివరాల ప్రకారం - నందిరాజ్ ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో నేరేడ్‌మెట్‌లోని ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో మరో బైక్ వచ్చి అతని బైక్‌ను ఢీకొట్టింది. దాంతో నందిరాజ్‌తో పాటు బైక్‌పై కూర్చున్న మరో వ్యక్తి కిందపడ్డారు. కింది నుంచి లేచిన తర్వాత మరో వ్యక్తి నందిరాజ్‌పై దాడి చేయడం ప్రారంభించాడు.
దాడి చేసిన వ్యక్తి బౌల్డర్ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. దీంతో నందిరాజ్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు దాడి చేసిన వ్యక్తి బైక్ నెంబర్ నోటు చేసుకున్నారు. ఆ నెంబరును పరిశీలిస్తే అది నందిరాజ్ బావ సత్యనారాయణదని తెలిసింది.
గత రెండేళ్లుగా సత్యనారాయణ భార్య రూప తన సోదరుడు నందిరాజ్ వద్ద ఉంటోంది. ఆమె ఇటీవలే విడాకులకు కూడా దరఖాస్తు చేసుకుంది. దీనివల్ల బావ మరిదిపై సత్యనారాయణ కక్ష పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. సత్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications