సూరి కేసు: ఏ క్షణంలోనైనా జగన్ సన్నిహితుడి అరెస్ట్?

Mangali Krishna
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మంగళి కృష్ణను సిఐడి అధికారులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు మద్దెలచెర్వు సూరికి ఐదు ఆయుధాలు ఇచ్చినట్లు విచారణలో తేలిందని అంటున్నారు.

దీంతో ఆయనపై ఆయుధాల చట్టం కింద ఏ క్షణమైనా సిఐడిలో కేసు నమోదు చేసే అవకాశముందని, ఆ తర్వాత అరెస్టు కూడా తప్పక పోవచ్చునని అంటున్నారు. ఇతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా సిఐడి పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే మంగళి కృష్ణతో కలిసి మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన భాను కిరణ్ హైదరాబాద్ పరిసరాల్లో భారీగా సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2008లో ఓ రియాల్టర్ తన సూసైడ్ నోట్‌లో మంగళి కృష్ణ పేరు పేర్కొన్నారు. కృష్ణ ముఠా వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశారు. కాగా మంగళి కృష్ణపై నమోదైన కేసులలో కొన్ని కొట్టివేయగా మరికొన్ని కొనసాగుతున్నాయి. ఆరు నెలల క్రిందటే పులివెందుల పోలీసులు మంగళి కృష్ణపై రౌడీషీట్ తెరిచారు. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలలో పులివెందుల నుంచి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి హత్య జరిగిన సమయంలో గృహ దహనాల కేసు, అనంతపురంలోని సూటుకేసు బాంబుతో పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర పన్నారనే కేసు, జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణను నిరసిస్తూ ధర్నాకు దిగిన సంఘటన పైనా కేసు, ఏ ఎస్సైపై దాడి తదితర కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+