జగన్‌కు మంగళి కృష్ణ కుడి భుజం, బెదిరించాడు: విహెచ్

కానీ ఎక్కడో కడప జిల్లా పులివెందులలో పుట్టి హైదరాబాదులో మంగళి కృష్ణ నేరాలు చేస్తున్నాడంటే ఆయన ఎంత పెద్ద రౌడీయే అర్థమవుతోందన్నారు. వైయస్ జగన్ మద్దతు లేకుండా కృష్ణ ఇవన్నీ ఎలా చేయగల్గుతాడని ప్రశ్నించారు. మద్దెలచెర్వు సూరికి, ఆయన హత్యలో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు మంగళి కృష్ణ ఆయుధాలు ఇచ్చారని ఆరోపించారు.
ఇవన్నీ జగన్ సపోర్టు లేకుండానే కృష్ణ చేశారా అని విహెచ్ ప్రశ్నించారు. భానుతో కలిసి కృష్ణ భారీగా అక్రమాలకు పాల్పడ్డాడన్నారు. జగన్ అనుచరుడినని చెప్పుకునే కృష్ణకు ఆయుధాలు ఎక్కడివన్నారు. భాను కిరణ్ వద్దకు ఆయుధాలు ఎలా వచ్చాయో విచారణ జరిపించి నిజాలు బయటకు రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడూ జగన్ వెంట ఉండే కృష్ణకు ఆయన అండ ఖచ్చితంగా ఉంటుందన్నారు.
నిత్యం కాంగ్రెసుపై విరుచుకు పడే భారతీయ జనతా పార్టీ అగ్ర నేత వెంకయ్య నాయుడుకు జగన్ అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆయన జగన్ అక్రమాలపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. వెంకయ్యకు జగన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారని తాను భావిస్తున్నానని చెప్పారు.
జగన్‌కు కేవలం అధికార దాహమే ఉందనుకున్నానని, కానీ ఆయన నేరస్థులను కూడా తన వెనుక వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో తాను సీమాంధ్రకు వెళ్లి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. ఆయన పార్టీకి ఓటు వేయవద్దని కోరతానని చెప్పారు. జగన్ నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications