ఏ పదవైనా సిద్ధం!: సోనియాతో చిరు, 'సచిన్‌'పై స్పందన

Sonia Gandhi-Chiranjeevi
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి గురువారం సాయంత్రం ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సోనియాతో చిరంజీవి సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియా గాంధీతో జరిగిన భేటీలో చర్చించిన విషయాలపై చెప్పారు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై తాను సోనియా గాంధీతో చర్చించానని ఆయన చెప్పారు. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రచార బాధ్యతలు అప్పగిస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీలో కూడా ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సోనియాకు చిరు చెప్పారు.

మంత్రి పదవి గురించి సోనియా గాంధీతో చర్చించలేదన్నారు. మంత్రివర్గ విస్తరణపై తనకు ఏ విషయం తెలియదన్నారు. విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదని చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం గొప్ప విషయమన్నారు. ఉప ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేస్తానని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా చిరంజీవి సోనియాతో భేటీలో మంత్రి పదవి గురించి కూడా చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే తిరుపతి అభ్యర్థిపై కూడా చర్చించారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+