ఎట్టకేలకు ఎమ్మెల్యే హికాకా విడుదల: రిజైన్ హామీతోనే

ఆయన ఉదయం పదిగంటల ప్రాంతంలో బలిపేటకు చేరుకున్నారు. ఆయన కోసం కుటుంబ సభ్యులు, నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. జర్నలిస్టులు తరలి వచ్చారు. హికాకా 32 రోజుల పాటు మావోల చెరలో ఉన్నారు. మావోలు అతనిని విజయిఘాటి అడవులలో వదిలి పెట్టారు. తనను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం అందించారు.
హికాకాను గత మార్చి 24న మావోలు అపహరించారు. అప్పటి నుండి ప్రభుత్వం ఆయన విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే విదేశీయుల విడుదలకు చూపిన చొరవను ప్రభుత్వం చూపలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హికాకా మావోయిస్టు సానుభూతిపరుడు కాబట్టి ఆయనను ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అంత చొరవ చూపలేదని అంటున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఒప్పందంతో మావోలు జిన్నా హికాకాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవల జరిగిన ప్రజాకోర్టులో రాజీనామా చేస్తానని లిఖిత పూర్వక హామీ ఇచ్చారని తెలుస్తోంది. బిజెడితో అన్ని సంబంధాలను తెంచుకొని సాధారణ పౌరుడిగా జీవించాలని ఆయనను మావోలు ఆదేశించారట. అపహరణ అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జిల్లా బిజెడి కార్యకర్తలు, నాయకుల తీరుపై హికాక అసంతృప్తి కూడా వ్యక్తం చేశారట.












Click it and Unblock the Notifications