సోమిరెడ్డి 'జగన్ కేబినెట్' వ్యాఖ్యలు: అంబటి కౌంటర్

జగన్‌కు రాష్ట్రంలో వస్తున్న ప్రజాధరణ చూసిన సోమిరెడ్డి వాస్తవాన్ని గ్రహించారని, అందుకే తమ అధినేత సిఎం అవుతాడని అంగీకరించారన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని ఎద్దేవా చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికలలో ఓటర్ల దెబ్బకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు సోమిరెడ్డికి కూడా చిన్న మెదడు చితికిపోయిందన్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలలో ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్లిద్దరూ మారువేషాల్లో తిరగాల్సిందేనని ఎధ్దేవా చేశారు. లేదంటే వారిని సొంత పార్టీ వారే చెప్పులతో కొట్టి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.
కాగా చిన్న వయస్సులోనే వైయస్ జగన్‌కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆళ్లగడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. ఆమె కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపిలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications