భాను, కృష్ణల గాడ్ ఫాదర్ జగన్: చంద్రబాబు

నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్‌గా చేశారని, దాంతో కరుణాకర్ రెడ్డి దేవుని సొమ్మును దోచేశారని ఆయన అన్నారు. తిరుపతి పర్యటన అనంతరం ఆయన రేణిగుంట మీదుగా కడప జిల్లాలోని రైల్వే కోడూరుకు చేరుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉప ఎన్నికల్లో తాము అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, తనకు కార్యకర్తలపై నమ్మకం ఉందని, తప్పకుండా తాను ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన రైల్వే కోడూరు సభలో అన్నారు. మంగలి కృష్ణతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంబంధాలపై ఆయన నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల కన్నా పులివెందుల రౌడీలను ఎదుర్కోవడమే తమకు ముఖ్యమని ఆయన అన్నారు.
మంగలి కృష్ణతో ఉన్న సంబంధాలను వైయస్ జగన్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. పులివెందుల గూండాలకు ఎవరూ భయపడవద్దని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ఓటేస్తే రాష్ట్రం అంధకారమేనని ఆయన అన్నారు. వారానికో కాంగ్రెసు అధిష్టానం పరిశీలకుడు వచ్చి సూట్‌కేసులతో వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పులివెందుల రౌడీల బాధితులకు తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్, సూట్‌కేసు బాంబు కేసులో నిందితుడు మంగలి కృష్ణలకు వైయస్ జగన్ గాడ్ ఫాదర్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డే తొలి ముద్దాయి అని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని నమ్ముకున్న వాళ్లు జైలులో ఉన్నారని, తనను నమ్ముకున్న వాళ్లు ఉన్నత స్థాయిల్లో ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications