చిరంజీవి కేంద్రపదవికి 'తిరుపతి' లింక్, కిరణ్‌కూ స్పెషల్

Chiranjeevi
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవికి కేంద్రమంత్రి పదవి రావడానికి 'తిరుపతి'కి లింక్ ఉందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలలో పదిహేడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన నేతల రాజీనామా వల్ల వచ్చినవి.

అయితే తిరుపతికి మాత్రం చిరంజీవి రాజ్యసభకు వెళ్లడం ఉప ఎన్నికల జరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన వాటన్నింటి కంటే కాంగ్రెసుకు ముఖ్యంగా చిరంజీవికి ఈ స్థానం ప్రతిష్టాత్మకమైనది. మిగిలినచోట్ల గెలుపోటముల విషయం ఎలా ఉన్నా తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెసు గెలవాల్సిందే. లేదంటే కాంగ్రెసుతో పాటు చిరంజీవి పరువు కూడా పోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా చిరు కేంద్ర పదవికి, తిరుపతికి లింక్ పెట్టిందనే వాదన వినిపిస్తోంది.

తిరుపతిలో కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించే బాధ్యత పూర్తిగా చిరంజీవికే అప్పగించిందట. మిగిలిన నియోజకవర్గాలలో ప్రచార బాధ్యతలను అప్పగిస్తూనే తిరుపతిని మాత్రం ప్రత్యేకంగా తీసుకోవాలని సూచించిందట. అదే సమయంలో చిరుకు హామీ ఇచ్చిన మంత్రి పదవిని ఉప ఎన్నికల ఫలితాల తర్వాతే ఇవ్వనున్నారని అంటున్నారు.

తిరుపతిలో కాంగ్రెసు అభ్యర్థి గెలిస్తే ఆయనకు పదవి ఇస్తారని, ఒకవేళ పార్టీ ఓడితే చిరు ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు. గత డిసెంబర్‌లో తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో చిరు అండ్ కో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. అప్పుడే అధిష్టానం చిరుకు కేంద్ర పదవి హామీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. అయితే తిరుపతి గెలుపుకి, పదవికి సంబంధం లేదని మరికొందరు చెబుతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తిరుపతి నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఇది తన సొంత జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ పార్టీని గెలిపించుకోకపోతే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయనను ఎప్పుటికప్పుడు సిఎం పీఠం నుండి దింపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+