జెడి బదలీపై ప్రభుత్వ నివేదిక: డైరెక్టర్ భూపతి బాబు పైకి

ఎనిమిది మంది ఐపిఎస్ అధికారులలో ముగ్గురిని మాత్రమే ఐజిలుగా పదోన్నతి కల్పిస్తూ బదలీ చేశామని చెప్పింది. అందులో శ్రీనివాస్ రెడ్డి ఒకరని చెప్పింది. శ్రీనివాస్ రెడ్డి బదలీ సక్రమమే అని చెప్పింది. శ్రీనివాస్ రెడ్డికి ప్రమోషన్ కల్పించి ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని నియమించామని తెలిపింది.
అదే సమయంలో ఎసిబి అదనపు డైరెక్టర్ భూపతి బాబును కూడా టార్గెట్ చేసింది. ఎసిబి డైరెక్టర్ పదవికి డిఐజి ర్యాంకు అధికారి అర్హుడని, కానీ భూపతి బాబు అడిషనల్ డిఐజియేనని ఆయన ఆ పదవికి అనర్హుడని తెలిపింది. అర్హత లేకున్నప్పటికీ ఆయనను ఎసిబి డైరెక్టర్‌గా నియమించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించింది.
కాగా శ్రీనివాస్ రెడ్డి బదలీపై ఈ నెల 27వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఈ రోజు నివేదిక ఇచ్చింది. అనంతరం కోర్టు, జూన్ 11లోగా నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. కేసు విచారణనను జూన్ 16వ తేదికి వాయిదా వేసింది.
కాగా ఇటీవల విజయనగరం జిల్లా ఎసిబి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదలీ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనను ప్రభుత్వం రాత్రికి రాత్రే బదలీ చేసింది. దీనికి ఆయన శ్రీనివాస్ రెడ్డి ససేమీరా అన్నారు. డైరెక్టర్ భూపతి బాబు కూడా ఆయనను రిలీవ్ చేయమని ప్రభుత్వానికి చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం సర్ది చెప్పడంతో భూపతిబాబు రిలీవ్ చేశారు. ఈ పరిణామంలో భూపతి బాబు రెండుసార్లు ప్రభుత్వానికి ఘాటైన లేఖలు రాయడం గమనార్హం.












Click it and Unblock the Notifications