Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెమెరాతో రాసలీలల చిత్రీకరణ: హనీఫ్, తారా గుట్టురట్టు

Tara Chowdary
హైదరాబాద్: వ్యభిచార కుంభకోణంలో అరెస్టైన తారా చౌదరి అసిస్టెంట్ హనీఫ్ ఆమె గురించి పలు విషయాలు చెప్పాడు. బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం హనీఫ్‌ను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. హనీఫ్ మీడియాతో మాట్లాడాడు. తారా చౌదరితో తనకు 2005 సంవత్సరం నుండే పరిచయం ఉందని చెప్పాడు. ఆమె బ్యాంకు అకౌంట్లు అన్ని తానే చూస్తానని, తారా ఇంటికి సినిమా రంగానికి చెందిన ప్రముఖులు వచ్చే వారని అతను చెప్పాడు.

తారా చౌదరి బ్యాంకు అకౌంట్లలో రూ.70 లక్షల లావాదేవీలు జరిగాయని, ప్రముఖుల రాసలీలలను తాను స్పై కెమెరాతో చిత్రీకరించానని హనీఫ్ చెప్పాడు. తారా చౌదరి పలు సినిమాలకు ఫైనాన్స్ చేసిందని, రూ.5 నుండి రూ.10 వరకు వడ్డీకి ఇచ్చేదని తెలిపాడు. తాను వెళ్లి పోతానంటే తారా చౌదరి బెదిరించేదని చెప్పాడు. తాను ఆమె దగ్గర ఓ సంవత్సరం పాటు హౌస్ అరెస్ట్‌గా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను కనుక ఆమె నుండి దూరంగా వెళితే తనకు తెలిసిన ప్రముఖుల ద్వారా దొంగతనం కేసులో ఇరికిస్తానని భయపెట్టేదని చెప్పాడు. తారా జ్యోతి ఐ లవ్యూ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైందని, ఆమె ఓ సినిమా షూటింగులో ఏడేళ్ల క్రితం తనకు పరిచయమైందని చెప్పాడు. రెండేళ్ల క్రితం తారా చౌదరి ఓ బ్యానర్ పైన మూవీ తీసేందుకు కూడా సిద్ధమైందని చెప్పాడు. తాను ఆమె దగ్గర వెట్టిచారికి చేశానని ఆయన చెప్పాడు.

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చే వారని విలేకరులు పలుమార్లు అడిగినప్పటికీ హానీఫ్ చెప్పలేదు. తాను కేవలం అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి పని చేసి వచ్చేవాడినని, అంతకుమించి తనకు సంబంధం లేదన్నాడు. ఆమె ఇల్లీగల్ ఆక్టివిటీస్‌తో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నాడు. తాను పని చేసినప్పుడే ఎంతో కొంత డబ్బు ఇచ్చేదని చెప్పాడు. తారాచౌదరి కొంతమంది అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి లాగిందని చెప్పాడు.

కాగా తారాచౌదరి అకౌంట్ల పైన దృష్టి సారించామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. హనీఫ్ నుండి పోలీసులు స్పై కెమెరాలు, ఫోటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మోడల్స్ తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా అందులో ఉన్నారని తెలుస్తోంది. కాగా కొందరు ప్రముఖులు ఉన్న సిడిలు బయటకు రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

తారా చౌదరి బ్యాంక్ అకౌంట్లలో భారీగా డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బులు ఆమెకు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుండి ఇఛ్చారు అనే కోణంలో దర్యాఫ్తు చేయనున్నారని తెలుస్తోంది. ఆమెతో సహా ఇల్లీగల్ ఆక్టివిటీస్‌లో ఎవరి పాత్ర ఉందనే కోణంలోనూ విచారిస్తున్నారు.

తారా చౌదరి ఇంట్లో నుండి పోలీసులు సుమారు 90 సిడిలు తీసుకొని డీకోడ్ చేసేందుకు పంపించారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది. ఆ ఆడియోలు, వీడియోలు వస్తే అందులో ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది. ఈ తొంబై సీడీలే కాకుండా మరికొన్ని సిడిలు కూడా ఆమె వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తారా చౌదరికి కోర్టు వచ్చే నెల 11 వరకు రిమాండ్ విధించింది.

కాగా తారా ఆదేశాలతోనే హనీఫ్ అమ్మాయిల అసభ్యకరమైన వీడియోలు తీశాడని సమాచారం. పలువురు మోడల్స్ కోసం తారా చౌదరి పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించిందని తెలుస్తోంది. హనీఫ్ కెమెరాలో పలువురు మోడల్స్ ఫోటోలు ఉన్నాయట. మరోవైపు హనీఫ్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు అతనికి మే 17 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+