కెసిఆర్ చేతిలో కెసిఆర్ కీలుబొమ్మ: మోత్కుపల్లి పైర్

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మరోసారి మండిపడ్డారు. కెసిఆర్‌ను ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మగా అభివర్ణించారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదని, ఈ విషయాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా గుర్తించాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్లమెంటులో కెసిఆర్ సోనియాను గానీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గానీ ఒక్క మాట కూడా అనడం లేదని, అమ్ముడుపోయిన తర్వాత మాట్లాడే దమ్ము ఎలా ఉంటుందని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్రం మీద ఒత్తిడి లేని దద్దమ్మ కెసిఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ ఎప్పుడు వస్తుందో చెప్పాలని ఆయన కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. కెసిఆర్ 11 ఏళ్లుగా మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కెసిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయడం మానేసి ఫామ్‌హౌస్‌లో పడుకుని లాబీయింగ్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎంత పోరాడినా తెలంగాణ రాదని, కెసిఆర్ సోనియా చేతిలో ఉన్నారని, అలా ఉన్నంత కాలం తెలంగాణ రాదని ఆయన అన్నారు.

తెలంగాణ రాకుండా కెసిఆర్ అడ్డుపడుతున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు. పార్లమెంటు తెలంగాణ ఇస్తుందా, హైదరాబాద్ ఇస్తుందా అని ఆయన అడిగారు. అమ్ముడుపోవడం వల్లనే సోనియాను కెసిార్ విమర్శించలేకపోతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ పోలవరం టెండర్లు తెచ్చుకున్నారని, డబ్బులు తెచ్చుకున్నారని, కుటుంబ సభ్యుల కోసం తెంలగాణవాదాన్ని వాడుకున్నారని, అందువల్ల తెలంగాణవాదాన్ని కెసిఆర్ ఢిల్లీలో వినిపించే స్థితిలో లేరని ఆయన అన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే ప్రకటనల వల్ల బలహీనవర్గాల పిల్లలు బలవుతున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసులో విలీనమవుతామని కెసిఆర్ చెప్పారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ఫోరం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము రెండు సార్లు రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. కెసిఆర్ మోసగాళ్లకే మోసగాడని ఆయన అన్నారు. సెజ్‌ల గురించి, కుంభకోణాల గురించి, భూవిక్రయాల గురించి కెసిఆర్ ఏ రోజు కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. తెరాస వార్షికోత్సవ సభ ప్రాంగణానికి జయశంకర్ పేరు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. పాపాత్ములకు జయశంకర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+