వివాహేతర సంబంధం: ప్రియుడి చేతిలో వివాహిత హత్య

పని చేస్తున్న చోట వెంకట రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఉప్పల్‌లో ఉంటున్న వెంకట రెడ్డి ఇంటికి వెళ్లింది. అక్కడ డబ్బు విషయమై వారిద్దరికీ ఘర్షణ వచ్చింది. ప్రేమవాణి స్వగ్రామంలో ఉన్న తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతుండగానే ఫోన్ హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ప్రేమవాణి తల్లికి అనుమానం వచ్చింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది.
కాగా ఈ నెల 14వ తేదిన వెంకట రెడ్డిని కలిసేందుకు ప్రేమవాణి వెళ్లిందని, కారులో ఆమెను తీసుకు వెళుతుండగా ఇద్దరి మధ్య మాటా మాట పెరగడంతో అతని ఎదుటే ఆమె నిద్రమాత్రలు మింగిందని, కంగారుపడి ఆమెను విజయపురి సౌత్ పాత చెక్‌పోస్టు సమీపంలో గొంతు నులిమి చంపి అక్కడే పడేశారని కూడా విచారణలో తేలిందని సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా భర్తతో గొడవ కారణంగా ఓ భార్య హైదరాబాదులో తనను తాను అంటించుకుంది. ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారు. ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి భర్త నిరుద్యోగి కావడమే కాకుండా నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుంటాడని పోలీసులు చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఇద్దరి మధ్య మాటా మాట పెరిగడంతో భార్య తనను తనను కాల్చుకుంది.












Click it and Unblock the Notifications