ప్రథమ నిందితుడు వైయస్ జగనే: చంద్రబాబు ఆరోపణ

కేసు పెట్టిన సమయంలో ప్రథమ నిందితుడుగా జగన్ పేరును పేర్కొంటే అప్పట్లో ఆయన తండ్రి వైఎస్ అసెంబ్లీలో నానా గొడవ చేశారని ఆయన ృ గుర్తు చేశారు. భానుకిరణ్‌తో కలసి మంగళి కృష్ణ సినిమాలు తీసి హీరోయిన్లను కూడా చెడగొట్టారని ఆరోపించారు. తప్పు చేసినవారు తప్పించుకునే ప్రసక్తే ఉండదని, 2001లో పరిటాల రవి హత్యకు కుట్రపన్నిన కేసులో నిందితులకు 2012లో శిక్ష పడడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. చిత్తూరులో టీడీపీ నేత మద్రాసు బాబు హత్యకేసులో కూడా కాంగ్రెస్‌కు చెందిన హంతకులకు జీవిత ఖైదు పడిందని గుర్తు చేశారు. ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో మద్యం ధరలు ఇష్టానుసారం పెంచి రూ. 15 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. దీనిపై తమ పోరాటంతో పాటు కోర్టు కూడా కలగజేసుకోవడంతో కుంభకోణం గుట్టు రట్టయ్యిందన్నారు. బయట పడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, సంక్షేమ పథకాలు ఏవీ అమలు కావడం లేదన్నారు. పిల్లలు చదువుకోడానికి కూడా కరెంటు లేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిందన్నారు. రైతుల తరపున రాజీలేని పోరాటం చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, తాము అధికారంలోకి వస్తే వ్యవసాయరంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుకని, రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పప్పులు బెల్లాలు పంచిపెట్టి కొడుక్కు మాత్రం రాష్ట్రాన్ని దోచిపెట్టాడని ఆరోపించారు. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని రకాల పన్నులు పెంచివేసిందని, తాము పోరాడాకే వస్త్రాలపై పన్ను తగ్గించిందన్నారు. అయితే ఈ విషయంలో పాలకులు ఎంతమేరకు కమీషన్లు నొక్కారో చెప్పాలని డిమాండ్‌చేశారు. రాజకీయాల్లో సామాజిక న్యాయమనే నినాదంతో ఓ సినిమా నటుడు పార్టీ పెట్టారని, అయితే ఆయనకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు.
'ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామిని చూడటానికి వచ్చారు. కానీ జగన్ మాత్రం ఇప్పటిదాకా ఒక్క సారి కూడా రాలేదు. దేవుని పట్ల భక్తి విశ్వాసాలు లేని ఈయన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఏమి పట్టించుకుంటాడో, ఇక్కడి ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో ఆలోచించండి' అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్, అయన అనుచరుడు మంగళి కృష్ణ పాపాలు తిరుపతిలో కూడా జరిగాయన్నారు. తిరుపతిలోని లీలా మహల్ థియేటర్ యజమానులను మంగళి కృష్ణ బెదిరించి ఆ స్థలాన్ని కొట్టేశాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications