వెళ్లారు, వచ్చారు!: మంగళికృష్ణ సహా ముగ్గురికి బెయిల్

అనంతరం వారిని అనంతపురం జిల్లా నుండి కడప జిల్లా జైలుకు తరలించారు. వారు వెంటనే అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రోజు విచారించిన కోర్టు మంగళి కృష్ణతో సహా ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మరో నిందితుడు కొత్తకోట రవీంద్ర రెడ్డికి బెయిల్ రాలేదు. మంగళి కృష్ణ సెషన్స్ కోర్టు తీర్పుపై జిల్లా కోర్టులో సవాల్ చేశాడు.
కాగా 2001లో సూటుకేసు బాంబు కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా పేరుగాంచిన మంగళి కృష్ణకు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళి కృష్ణ ఎ-5 నిందితుడిగా ఉన్నారు. కృష్ణతో పాటు ఎ-2గా ఉన్న రామచంద్రా రెడ్డి, ఎ-3గా ఉన్న రవీంద్రా రెడ్డి, ఎ-4గా ఉన్న సుధీర్ రెడ్డికి కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
కాగా తనకు జైలు శిక్ష పడిన అనంతరం మంగళి కృష్ణ మీడియాపై మండిపడినట్లుగా తెలుస్తోంది. అంతా మీవల్లనే జరిగిందంటూ మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారట. మిగతా విషయాలు మాట్లాడేందుకు ఆయన ఏమాత్రం ఆసక్తి చూపలేదని అంటున్నారు. కాగా మంగళి కృష్ణకు ఐదేళ్ల జైలు శిక్ష పడటంపై తాము జిల్లా కోర్టులో అప్పీలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. 2001లో వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదయిందని చెప్పారు.
2001లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ఆయన పెనుగొండ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అప్పటి మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్రను హత్య చేసేందుకు వీరు సూటుకేసు బాంబు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ఐస్ క్రీం బండిలో ఈ బాంబు ఉంచి పేల్చేందుకు వారు వ్యూహరచన చేశారు. కానీ అది విఫలమైంది.
ఈ అంశం అప్పట్లో అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ కేసు పదకొండేళ్లు కొనసాగింది. బుధవారం కోర్టు అంతిమ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై పరిటాల రవి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళి కృష్ణతో పాటు మిగిలిన ముగ్గురికి ఐదు సెక్షన్ల క్రింద కోర్టు శిక్ష ఖరారు చేసింది. 120బి, మారణాుధాలు కలిగిన చట్టం, ఎపిపిఎస్ యాక్ట్ 3, 4, 5 సెక్షన్ల క్రింద వారికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications