తారా చౌదరి అకౌంటెంట్ కోసం పోలీసు గాలింపు

Tara Chowdary
హైదరాబాద్: తారా చౌదరి సహాయకుడు హనీఫ్ వెల్లడించిన విషయాలతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హనీఫ్ తారా చౌదరి వ్యవహారాల గురించి పూర్తిగా పోలీసుల వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు తారా చౌదరి అకౌంటెంట్ వీరభద్రం కోసం గాలిస్తున్నారు. తారా చౌదరి సినిమాలకు ఐదు, పది శాతం వడ్డీతో అప్పులు ఇచ్చేదని హనీఫ్ వెల్లడించాడు. దీంతో తారా చౌదరి బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.

తారా చౌదరి సహాయకుడు హనీఫ్‌ను పోలీసులు గురువారం రాత్రి ఇందిరా నగర్‌లోని అతని మిత్రుడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. తారా చౌదరి అరెస్టు తర్వాత కనిపించకుండా పోయిన హనీఫ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఇందిరా నగర్‌లోని మిత్రుడి ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అతన్ని అరెస్టు చేసి, పలు విషయాలు రాబట్టారు.

కాగా, తారా చౌదరి నివాసానికి పలువురు సినీ ప్రముఖులు వచ్చేవారని హనీఫ్ చెప్పాడు. తారా చౌదరి తనను బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే తాను అక్కడ ఉండిపోయానని చెప్పుకున్నాడు. తారా చౌదరిని అరెస్టు చేసిన సమయంలో హనీఫ్ లేడు. అతను ముంబై వెళ్లినట్లు తారా చౌదరి పోలీసుల విచారణలో తెలిపింది. స్పై కెమెరాతో రాసలీలల ఫొటోలు తానే తీశానని హనీఫ్ అంగీకరించాడు.

కాగా, తారా చౌదరి నడుపుతున్న వ్యభిచార రాకెట్ వెనక ముంబై ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తారా చౌదరి, హనీఫ్ కస్టమర్ల కోసం ముంబై మోడల్స్‌ను తెచ్చేవారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. వారిని హనీఫ్ ఫొటోలు కూడా తీశాడు. అశ్లీల ఛాయాచిత్రాలు అనేకం హనీఫ్ తీశాడు. ఆ ఛాయాచిత్రాల్లో కొన్నింటిని టీవీ చానెళ్లు కొన్ని చూపించాయి. కొన్ని అసలు ఏ విధంగానూ ప్రసారం చేయలేనంత అసభ్యకరంగా ఉన్నట్లు టీవీ చానెళ్లు వ్యాఖ్యానించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+