నిశ్చితార్థం రద్దు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

మహేష్ సోనీ అనే 26 ఏళ్ల సాప్ట్‌వేర్ ఇంజనీర్ సోమవారం నుంచి విధులకు వెళ్లడం లేదు. దాంతో మిత్రులు అతనికి ఫోన్ చేశారు. కానీ అతను ఫోన్ ఎత్తలేదు. దాంతో వారు నివాసం యజమానికి ఫోన్ చేసి అతని గురించి అడిగారు. దాంతో అతను మహేష్ గదికి వెళ్లాడు. అయితే, గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది.
తలుపు లోపలి నుంచి పెట్టి ఉండడంతో, ఎంతగా ప్రయత్నించినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంత అనుమానించి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. మంగళవారంనాడు పోలీసులు వచ్చిన తర్వాత చూస్తే అతను ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.
కోటలోని మహవీర్ నగర్‌కు చెందిన మహేష్ అద్దెకు ఉంటున్నాడు. అతని అద్దె ఇల్లు శ్యాంనగర్ ఏరియాలోని వివేక్ విహార్‌లో ఉంది. ఇటీవలి కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications