తివారీకి షాక్: రక్తనమూనా ఇవ్వాల్సిందేనని కోర్టు

తాను తివారీకి పుట్టానని చెబుతున్న రోహిత్ శేఖర్ సింగిల్ జడ్డి ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. నాలుగు వారాల్లో ఎన్డీ తివారీ రక్త నమూనాను ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రోహిత్ శేఖర్ అనే యువకుడు - తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను వాదిస్తున్నాడు.
దాంతో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణిస్తున్నారు. తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్‌లో జారీ చేసింది.
తివారీయే తన అసలు తండ్రి అని వాదిస్తున్న రోహిత్ శేఖర్ (31), ఆయన తల్లి ఉజ్వల ఇంతకు ముందు మరో వైపు నుంచి నరుక్కొచ్చారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఉజ్వల భర్త బీపీ శర్మకు డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. నివేదికను జస్టిస్ రేవా ఖేత్రపాల్ కోర్టులో చదివి వినిపించారు.
రోహిత్ డీఎన్ఏ తల్లి ఉజ్వలతో సరిపోలుతోందని, ఆమె భర్త బీపీ శర్మతో సరిపోలడంలేదని తెలిపారు. దీంతో ఉజ్వల, బీపీ శర్మల బంధం వల్ల రోహిత్ జన్మించలేదని రుజువైంది. 'తివారీయే నా తండ్రి' అన్న రోహిత్ వాదనకు బలం చేకూరింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications