బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్లు జైలు శిక్ష, జరిమానా

బంగారు లక్ష్మణ్ 2001లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ లక్ష్మణ్ పట్టుబడ్డారు. అప్పటి నుంచి 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. బంగారు లక్ష్మణ్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు. లక్ష్మణ్‌ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. శుక్రవారం కోర్టు తీర్పు తర్వాత బంగారు లక్ష్మణ్ కోర్టు హాల్లో కంటతడి పెట్టారు.
స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినప్పుడు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగారు లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ జాతీయాధ్యక్షుడి దాకా ఎదిగారు. అయితే, తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌తో ఆయన జాతకం తిరగబడింది.
ఢిఫెన్స్ డీల్‌లో ఆయుధ డీలర్లుగా చెప్పుకుని మారు రూపాల్లో వెళ్లిన తెహెల్కా జర్నలిస్టుల నుంచి లంచం తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ పట్టుబడ్డారు. తెహెల్కా వెబ్‌సైట్ జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్ చేసి బంగారు లక్ష్మణ్ ఉదంతాన్ని బయటపెట్టారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ సిడిలను 2001 మే 13వ తేదీన విడుదల చేశారు.
ఆయుధ డీలర్లుగా చెప్పుకుంటూ వెళ్లిన జర్నలిస్టుల నుంచి బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బంగారు లక్ష్మణ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి టి. సత్యమూర్తికి ట్రయల్ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. అతను అప్రూవర్‌గా మారడంతో సత్యమూర్తిని కోర్టు క్షమించింది.












Click it and Unblock the Notifications