మోహన్ బాబు ఇంటికి జగన్, సమీకరణాలు మారేనా?

మోహన్ బాబు ఇటీవల తన అరవయ్యో పుట్టిన రోజు సందర్భంగా రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని తన పుట్టిన రోజు వేడుకలకు చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా పిలవడం, ఆయనను పొగడటం చేశారు. దీంతో మోహన్ బాబు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి.
ఇలాంటి సమయంలో అదీ ఉప ఎన్నికలకు ముందు జగన్ ఆయన ఇంటికి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలను కూడా పరిశీలకులు కొట్టి పారేయడం లేదు. వారిద్దరి భేటీపై ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లి ఉంటారని, తిరుపతిలో మద్దతు కోసం వెళ్లారని ఇలా తదితర ప్రచారాలు జరుగుతున్నాయి.
అయితే తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే జగన్ హీరోను కలిశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరి రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతాయా లేదో చూడాలి.












Click it and Unblock the Notifications