పరకాలలో బిజెపికి సీన్ లేదు! డిపాజిట్ రాదు: కెసిఆర్

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడం వల్ల బిజెపికి గెలుపు వచ్చిందని, పరకాలలో అలాంటి అవకాశం లేదని అన్నారట. అక్కడ బిజెపి ప్రభావం శూన్యమని చెప్పారు. ఈసారి 50 శాతం ఓట్లు తెరాస సాధిస్తే, మరో 50 శాతం ఓట్లు కాంగ్రెసు, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి పంచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలకు సోమవారం హాజరవుతున్నానని, కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలతోపాటు తమనూ సస్పెండ్ చేస్తే బయటికి వస్తామని, లేకపోతే సభను స్తంభింపజేస్తామని చెప్పారు.
పరకాల విజయంతో తెలంగాణలో అసలైన తెలంగాణవాద పార్టీగా తెరాసకు గుర్తింపు వస్తుందని ఆయన చెప్పారని తెలుస్తోంది. ఇక్కడి విజయం 2014 సాధారణ ఎన్నికల పైనా పడుతుందని, జాగ్రత్తగా పార్టీని గెలిపించుకుందామని చెప్పారు. పరకాలలో బిజెపి అన్ని పార్టీల తర్వాత ఉందని చెప్పారు. మే 2 నుంచి చేపట్టే పల్లెబాట కార్యక్రమం తర్వాత పార్టీకి అక్కడ యాభై నుండి అరవై శాతం వరకు ఓటింగ్ పెరగాలని చెప్పారు.
కాగా పరకాలలో మే 2 నుంచి 7 వరకు పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ నియోజకవర్గ స్థాయి నేత ఇన్‌చార్జిగా ఉంటారు. ప్రతి మండలానికి నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుంటారు. వారికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తోడుగా ఉంటారు.












Click it and Unblock the Notifications