సమయమొచ్చినప్పుడు: జగన్‌తో భేటీపై మోహన్‌ బాబు

Mohan Babu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తన భేటీ వివరాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆదివారం చెప్పారు. వైయస్ జగన్ ఉదయం మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో రాజకీయంగా ఏమైనా సమీకరణాలు మారుతాయా అనే చర్చ రాష్ట్రంలో తెరలేచింది. భేటీ అనంతరం మోహన్ బాబును మీడియా పలకరించింది.

తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. జగన్ బంధువుగానే కలిశారని చెప్పారు. మిగతా విషయాలు ఇప్పుడు చెప్పలేనన్నారు. కొద్దిరోజుల క్రితం విష్ణుకు కవల పిల్లలు పుట్టారని, అందుకే జగన్, ఆయన సతీమణి భారతి చుట్టపు రూపంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారని తెలిపారు.

కాగా భేటీలో ఏం జరిగిందని, రాజకీయంగా ఏమైనా సమీకరణాలు మారుతాయా అని విలేకరులు మోహన్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు ఆయన మీకు దండం పెడతాను, మీరంతా నావాళ్లే తనకు షూటింగ్ పని ఉందని చెప్పి కారులో వెళ్లిపోయారు. కాగా జగన్ తన సతీమణి భారతితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు.

ఇటీవల అరవయ్యో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మోహన్ బాబు తన వేడుకలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ఇరువురు ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. అప్పటి నుండి మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+