గవర్నర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది: నరసింహన్

Narasimhan
హైదరాబాద్: తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. తనను రెండోసారి గవర్నర్‌గా కొనసాగిస్తున్నందుకు ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యమని ఆయన చెప్పారు. తిరిగి తననే నియమించినందుకు ఆనందంగా ఉందన్నారు.

తనకు ఇప్పటి వరకు మీడియా చాలా సహకరించిందని చెప్పారు. భవిష్యత్తులో కూడా సహకరిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి గవర్నర్ పాత్ర తండ్రి వంటిదని ఆయన చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఆయన తన సతీమణితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగిస్తూ కేంద్రం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ పదవీ కాలం ఈ నెలాఖరుతో పూర్తి కావలసి ఉంది. నరసింహన్ పదవీ కాలం పూర్తి కానున్న దృష్ట్యా మళ్లీ ఆయనను కొనసాగిస్తారా, లేక ఆయన స్థానంలో మరెవరినైనా కేంద్రం నియమిస్తుందా అని రాజకీయ వర్గాలలో కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఇప్పుడు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ చర్చలకు తెర పడింది. నరసింహన్‌లాగానే మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్‌ను కూడా అదే పదవిలో కొనసాగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ గవర్నర్‌గా మార్గరెట్ ఆల్వా, గోవా గవర్నర్‌గా బి.వి. మాంచూను నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+