ఫామ్‌హౌస్‌లో పడుకున్నావు: కెసిఆర్‌కు బిజెపి కౌంటర్

మహబూబ్‌నగర్‌లో ఓడినా కెసిఆర్, ఆయన పార్టీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి, 2009లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసి, చివరకు ఉప ఎన్నికల్లో గెలిచినా తెలంగాణను సాధించుకోలేక పోయావని విమర్శించారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కాంగ్రెస్‌కు అమ్ముకున్నావన్నారు. ఇలాంటి వాటిపై ఆత్మ విమర్శ చేసుకోకుండా బిజెపిపై విమర్శలా అని ధ్వజమెత్తారు.
మహబూబ్‌నగర్‌లో ఓడినా గుణపాఠం నేర్చుకోలేదన్నారు. బిజెపి బలం పెరుగుతుందన్న ఆందోళనతో కాంగ్రెస్‌తో కుమ్మక్కై విమర్శలు చేస్తున్నావని మండిపడ్డారు. పార్లమెంటులో బిజెపి ప్రైవేటు తీర్మానాన్ని పెడుతుంటే ఫామ్ హౌస్‌లో పడుకున్నావని, తమ పార్టీపై ఇదే వైఖరి కొనసాగిస్తే నీకు, నీ పార్టీకి తెలంగాణ ప్రజలు విఆర్ఎస్ ఇస్తారని హెచ్చరించారు. పాలమూరు విజయంతో పరకాలలోనూ బిజెపికి అనుకూల పవనాలు వీస్తున్నాయని, పరకాలలో ఓడిపోతే తెరాస ఉనికికే ప్రమాదమన్న భయంతో బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ సాధన కేవలం బిజెపితోనే సాధ్యమన్నారు. దీనిని కెసిఆర్, తెరాస గుర్తించాలని లేకుంటే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలను వంచించిన కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను వదిలి ప్రత్యేక రాష్ట్రంపై చిత్తశుద్ధితో ఉన్న తమను విమర్శించడమేమిటన్నారు. తెరాస నీతి, నిబద్ధత, అంకిభావం లేని పద్ధతుల్లో వ్యవహరిస్తోందన్నారు. ఆ పార్టీ వల్లే ఉద్యమం నీరుగారిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications