బిజెపికి బంగారు లక్ష్మణ్ గుడ్‌బై, జైలు శిక్ష పడినందుకే

Bangaru Laxman
న్యూఢిల్లీ: లంచం తీసుకున్న కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన బంగారు లక్ష్మణ్ బిజెపికి రాజీనామా చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బంగారు లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పంపించారని, జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి బంగారు లక్ష్మణ్ చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించిందని బిజెపి జాతీయ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ శర్మ చెప్పారు.

జైలు శిక్ష పడిన తర్వాత బంగారు లక్ష్మణ్‌ను పార్టీ దూరంగా పెట్టింది. బంగారు లక్ష్మణ్ వ్యక్తిగత స్థాయిలోనే లంచం అంగీకరించారని, దాంతో పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో బంగారు లక్ష్మణ్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బంగారు లక్ష్మణ్ లంచాన్ని అంగీకరిస్తూ తెహెల్కా స్గింగ్ ఆపరేషన్‌కు చిక్కారు.

తెహెల్కా కుంభకోణం స్టింగ్ ఆపరేషన్ కేసులో బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. లక్ష్మణ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని సిబిఐ కోరింది. అయితే, తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షను తగ్గించాలని బంగారు లక్ష్మణ్ కోర్టును కోరారు. దీంతో 72 ఏళ్ల బంగారు లక్ష్మణ్‌కు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన బంగారు లక్ష్మణ్‌ను కోర్టు శుక్రవారం దోషిగా నిర్దారించింది. ఆయనకు శనివారం కోర్టు శిక్షను ఖరారు చేసింది.

బంగారు లక్ష్మణ్ 2001లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ లక్ష్మణ్ పట్టుబడ్డారు. అప్పటి నుంచి 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. బంగారు లక్ష్మణ్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు. లక్ష్మణ్‌ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. శుక్రవారం కోర్టు తీర్పు తర్వాత బంగారు లక్ష్మణ్ కోర్టు హాల్లో కంటతడి పెట్టారు.

స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినప్పుడు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగారు లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ జాతీయాధ్యక్షుడి దాకా ఎదిగారు. అయితే, తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌తో ఆయన జాతకం తిరగబడింది.

ఢిఫెన్స్ డీల్‌లో ఆయుధ డీలర్లుగా చెప్పుకుని మారు రూపాల్లో వెళ్లిన తెహెల్కా జర్నలిస్టుల నుంచి లంచం తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ పట్టుబడ్డారు. తెహెల్కా వెబ్‌సైట్ జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్ చేసి బంగారు లక్ష్మణ్ ఉదంతాన్ని బయటపెట్టారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ సిడిలను 2001 మే 13వ తేదీన విడుదల చేశారు.

ఆయుధ డీలర్లుగా చెప్పుకుంటూ వెళ్లిన జర్నలిస్టుల నుంచి బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బంగారు లక్ష్మణ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి టి. సత్యమూర్తికి ట్రయల్ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. అతను అప్రూవర్‌గా మారడంతో సత్యమూర్తిని కోర్టు క్షమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+