ఫ్యామిలీ సమస్యల్లో బాబు, చిరంజీవిపై సరికాదు: గండ్ర

బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు దూరంగా ఉండనున్నారని చెప్పారు. పార్లమెంటులో టి-ఎంపీల తీరు తప్పు కాదన్నారు. పరిస్థితిలకు అనుగుణంగా వారు అలా వ్యవహరించారన్నారు. ఏదైనా ఒక సమస్యను ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ త్వరలో పరిష్కారమవుతుందని చెప్పారు.
ఇప్పుడు చిరంజీవిని విమర్శిస్తున్న నేతలు మూడేళ్ల కిందట ఏం మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని గండ్ర వెంకట రమణ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించడం సరికాదని మంత్రి శైలజానాథ్ అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో పదవులు పొంది, ఇప్పుడు ఎవరికోసమో విమర్శించడం సబబేనా అని ప్రశ్నించారు.
కాగా గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఆ ప్రాంతాల్లోనే ఉపాధి పనులు ఎక్కువగా చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు అధికారులకు సూచించారు. సోమవారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కౌన్సిల్ సమావేశం ప్రతి రెండు నెలలకు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు.
కౌన్సిల్ సభ్యులు కూడా మండలాల్లో తిరిగి ఉపాధి పనులు పర్యవేక్షించాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి జానారెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం, కమిషనర్ జయలక్ష్మి, సీవీవో కృష్టయ్య, డైరక్టర్ మురళి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications