చిరంజీవిపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్

చిరంజీవి శానససభ్యుడిగా ఎన్నికైన తర్వాత తిరుపతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు కాలేదని ఆయన అన్నారు. త్వరలో సువర్ణ యుగం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేసి తిరుపతి ప్రజలకు మంచినీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనది పేదకులమని అన్నారు. చిరంజీవి పిఆర్పీని హోల్ సేల్‌గా కాంగ్రెసుకు అమ్మేశారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.
చిరంజీవి వ్యక్తిగత స్వార్థంతో, పదవీ కాంక్షతో తిరుపతి శానససభా స్థానానికి రాజీనామా చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, సినీ నటి రోజా ఆరోపించారు. పార్టీని నడపలేక చిరంజీవి కాంగ్రెసుకు అమ్ముడుపోయారని ఆమె దుయ్యబట్టారు. మరోవైపు తొమ్మిదేళ్ల పాలనలో చిత్తూరు జిల్లాకు, తిరుపతి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని రోజా విమర్శించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం నేతలకు భంగపాటు తప్పదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించుకుంటామని ఆమె చెప్పారు. తిరుపతి పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి నుంచి వైయస్ జగన్ మంగళవారం తిరుపతిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి రాజీనామా చేయడంతో తిరుపతి శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.












Click it and Unblock the Notifications