వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి: పరువు హత్య

ప్రకాశం జిల్లాలోని కోమరోలు మండలం నల్లకుంట దగ్గర మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. బస్సు - లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
నల్గొండ జిల్లాలోని భువనగిరి బైపాస్ రోడ్డుపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్ యాప్రాల్‌కు చెందిన వారుగా గుర్తించారు.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడాల మండలం గేదెల్లలో దారుణం జరిగింది. దళిత యువకుడిని ప్రేమించిదనే కారణంతో కన్నకూతురిని ఓ తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications