అలనాటి నటీమణి అచలా సచిదేవ్ కన్నుమూత

హృతిక్ రోషన్ హీరోగా 2002లో విడుదలైన చిత్రం 'న తుమ్ జానో న హమ్'లో ఆమె చిట్టచివరగా నటించారు. ప్రస్తుత తరానికి ఆమె ఎక్కువగా తల్లి లేదా నాయనమ్మ పాత్రలలోనే పరిచయం. 2011 సెప్టెంబర్‌లో వంటగదిలో జారి పడటంతో ఆమె కాలు విరిగింది. తర్వాత మెదడులో రక్తం పలుచోట్ల గడ్డకట్టడంతో పక్షవాతం బారిన పడింది. దృష్టి కూడా పోయింది. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని, అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. చివరకు సోమవారం తుదిశ్వాస విడిచారు.
అచలా సచ్‌దేవ్ కుమారుడు జ్యోతియోన్ అమెరికాలో ఉంటున్నాడు. బ్లాక్ బస్టర్ వక్త్ సినిమాలో బాల్‌రాజ్ సాహ్ని భార్యగా ఆమె నటన విశేషంగా మన్ననలు పొందింది. ఈ సినిమా 1965లో వచ్చింది. ప్రేమ్ పూజారి, హరే రామ హరే కృష్ణ, అందాజ్ వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలో కాజోల్ నాయనమ్మగా నటించింది. కభీ ఖుషీ కభీ గమ్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తల్లిగా నటించింది.












Click it and Unblock the Notifications