హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై నన్ను ఫాలోకండి: బొత్స, సరిపోదన్న కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాను విమర్శిస్తున్నానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. బొత్సతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. తాను జగన్‌ను విమర్సిస్తున్నానని, మిగతా అందరూ నేతలు ఇదే పాటించాలని సూచించారు.

అభివృద్ధి చేశామని, సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని ఉప ఎన్నికలలో చెబితే సరిపోదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలను, చేపడుతున్న కార్యక్రమాలను ప్రచారం చేయాలని వారికి సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడాను ప్రజలకు వివరించాలని సూచించారు. జగన్ విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని సూచించారు.

ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే తాను ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. తాను ఇక నుండి నెల్లూరులోనే ఉంటానని పార్లమెంటు అభ్యర్థి టి. సుబ్బిరామి రెడ్డి అన్నారు. తనకు అంగబలం, అర్థబలం ఉందని సహకరించాలని నేతలను కోరారు. జగన్ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేక పోతున్నామని మంత్రి మహీధర్ రెడ్డి, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ విమర్శలను తిప్పి కొట్టాలని సూచించారు. పిసిసి చీఫ్, సిఎం జగన్ విమర్శలపై ఘాటుగా స్పందించాలని సూచించారు. కాగా పార్లమెంటు ఎన్నికలు జరిగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెసు అధికార ప్రతినిధులను నియమించింది.

English summary

 Pradesh Congress Committee president Botsa Satyanarayana suggested party leaders to follow him on YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy. chief minister Kiran Kumar Reddy organiged a meeting with SPS Nellore leaders on upcoming bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X