హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీ లేఖను చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Vallabhaneni Vamsi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసిన అంశంపై విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ ఇచ్చిన రాతపూర్వక వివరణను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుంటారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. వంశీ నేరుగా బాబుకే వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చారు.

అనంతపురం నుండి గురువారం బాబు ఉదయం వచ్చారు. బాబును కలిసేందుకు వంశీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ నేతలు మాత్రం ససేమీరా అన్నారు. నేరుగా బాబునే కలిసి వివరణ ఇచ్చుకుంటానని ఆయన చెప్పినప్పటికీ పార్టీ నేతలు మాత్రం అది కుదరదని, పార్టీ జిల్లా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి షోకాజ్ నోటీసులు జారీ చేసినందున మొదట ఆయనకే వివరణ ఇవ్వాలని సూచించారు.

అయితే వంశీ మాత్రం బాబుకే వివరణ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేశారట. అయినా కుదరకపోవడంతో వంశీ చివరకు వివరణ లేఖను బాబుకు పంపించారు. అందులో.. తాను జగన్‌ను యాధృచ్చికంగానే కలిశానని, వివాదాస్పదం వద్దని, పార్టీలో క్రమశిక్షణతో ఉన్నానని, పరిటాల రవి అనుచరుడినని అందులో పేర్కొన్నారు.

అయితే షోకాజ్ నోటీసులు జారీ చేసిన చోటు కాకుండా హైదరాబాదులో వివరణ ఇస్తే బాబు అంగీకరించే అవకాశం లేదని అంటున్నారు. గోరంట్లకు వివరణ ఇవ్వాల్సిందేనని నేతలు చెబుతున్నారట. అయితే వంశీ మాత్రం తన లేఖను బాబు అంగీకరిస్తారనే విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది.

English summary
The talk is going in Telugudesam, Is party chief Nara Chandrababu Naidu accept Vijayawada urban president Vallabhaneni Vamsi's letter. Vamsi wrote a letter to Chandrababu on thursday on YSR Congress Party chief YS Jaganmohan Reddy meeting issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X