ఉప ఎన్నికల దెబ్బ: తెలుగుదేశం మహానాడు వాయిదా

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడుపై ఉప ఎన్నికల దెబ్బ పడింది. త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తెలుగుదేశం పార్టీ మహానాడును ఉప ఎన్నికలు అయిన తర్వాతనే నిర్వహించాలని శుక్రవారం నాడు నిర్ణయించారు. ఇక్కడ జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భ వన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. ఉప ఎన్నికలు, మహానాడు నిర్వహణపై ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. మహానాడు ఎప్పుడు నిర్వహించేది ఉప ఎన్నికల తర్వాత నిర్ణయిస్తారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది.

పోలిట్‌బ్యూరో సమావేశానికి పలువురు సీనియర్లు గైర్హాజరయ్యారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరు కాలేదు. తనకు సభ్యత్వం లేనందున తాను హాజరు కాలేదని ఆయన అన్నారు. సమావేశానికి రావాలని తనకు పిలుపు వచ్చిందని, అయితే సభ్యత్వమే లేనప్పుడు సమావేశానికి ఎలా వెళ్తానని ఆయన అన్నారు.

కాగా ఉమ్మారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం నేత, సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ఉప్పులేటి కల్పనలు పోలిట్ బ్యూరో భేటీకి గైర్హాజరయ్యారు. విజయవాడలో దమ్ము ఎఫెక్ట్‌ కారణంగా హరికృష్ణ, పరకాల ఉప ఎన్నికలు ఉండటంతో ఎర్రబెల్లి, విదేశీ పర్యటనలో ఉండటంతో కల్పన హాజరు కాలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+