భాను కేసులో అరెస్ట్‌ల పర్వం, కృష్ణపై ఆయుధాల కేసు

Bhanu Kiran - Mangali Krishna
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. భాను కిరణ్‌కు సహకరించిన కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. భాను ద్వారా లబ్ధి పొందిన వారందరి పైనా సిఐడి కేసులు నమోదు చేయనుంది. భానుకు సంబంధించిన రివాల్వర్లు దాచిన కేసులో పోలీసులు విష్ణువర్దన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుండి రెండు నాటు తుపాకులు, ఒక రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా పేరుగాంచిన మంగళి కృష్ణపై కూడా ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసింది. కృష్ణను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. పాట్నా సమీపంలోని ఓ జిల్లా కేంద్రం నుంచి ఆయుధాలు తెచ్చి రాష్ట్రంలో సెటిల్‌మెంట్ల ముఠాలకు ఆయన అందజేసేవాడని పక్కా ఆధారాలు సేకరించారు. అనంతపురంలో బోస్ అనే వ్యక్తి దగ్గర రెండు ఆయుధాలు దాచినట్లు భాను వెల్లడించడంతో వాటికోసం గాలింపు సాగుతోంది.

పాట్నా నుంచి తెచ్చే ఆయుధాలతోనే సినీ నిర్మాతలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర భూయజమానులను భాను, కృష్ణ గ్యాంగ్ బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. భాను ద్వారా లబ్ధి పొంది, ఇష్టారాజ్యంగా ప్రత్యర్థుల్ని బెదిరించిన కాంట్రాక్టర్లు, సినీ నిర్మాతలు, పారిశ్రామికవేత్తలను సిఐడి వరుసగా పిలిపించి కేసులు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్టు చేయనున్నారు.

భాను కస్టడీ ముగిసినందున మరిన్ని వివరాలు సేకరించేందుకు మరికొద్ది రోజులు అతనిని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఇందులో భాగంగా గురువారం సినిమా నిర్మాతలను పిలిపించి విచారించారు. భాను కిరణ్ తమను డబ్బు కోసం బెదిరించాడని పలువురు సినీ నిర్మాతలు సిఐడిని ఆశ్రయించారు. యువత, పోలీస్ పోలీస్ సినిమాల నిర్మాతలతో పాటు మరో ఇద్దరు నిర్మాతలు గురువారం సిఐడి ముందు హాజరయ్యారు.

ఐదు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకూ తమ నుంచి భాను వసూలు చేశాడని సిఐడికి చెప్పినట్లు సమాచారం. భానుతో కలిసి సెటిల్‌మెంట్లు చేసి గతంలో అరెస్టైన సినీ నిర్మాత కల్యాణ్‌కు చెందిన బాలాజీ ల్యాబ్‌లో తమను బెదిరించారని బాధితులు సిఐడికి చెప్పినట్లు తెలుస్తోంది. భాను హైదరాబాదులో కేవలం సెటిల్‌మెంట్ల కోసమే ఓ కార్యాలయాన్ని పెట్టారట. గురువారం భానుని అక్కడకు తీసుకెళ్లి వివిధ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం కొండాపూర్‌లోని అలేఖ్య అపార్ట్‌మెంట్‌లో భాను నివసించిన ఫ్లాట్‌కు వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా భాను కిరణ్ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని సిఐడి అడిషనల్ డిజి రమణమూర్తి చెప్పారు. రహస్యంగా చెప్పాలనుకుంటే 94406-27213కి ఫోను చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+