రహస్య డైరీ: ఆస్ట్రేలియా గర్ల్‌తో ఒబామా ప్రేమాయణం!

Barack Obama
మెల్‌బోర్న్: ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 1980లలో న్యూయార్క్‌లో ఓ ఆస్ట్రేలియన్ అమ్మాయితో చెట్టాపట్టాల్ వేశారట. కొంతకాలం ఆమెతో ప్రేమాయణం సాగించారట. సదరు ఆస్ట్రేలియా అమ్మాయితో ఒబామా ప్రేమకలాపం త్వరలోనే ఓ పుస్తక రూపంలో వెలుగులోకి రానుంది. బరాక్ ఒబామా: ది స్టోరి పేరిట అప్పట్లో ఆయనతో ప్రేమాయణం సాగించిన జెనెవియవ్ కుక్ డైరీ ఆధారంగా డేవిడ్ మారానిస్ అనే రచయిత పుస్తకం రాస్తున్నారు.

ఒబామాతో ప్రేమాయణం సాగించిన కుక్ అతని కంటే మూడేళ్లు పెద్దది. ఆస్ట్రేలియా దౌత్యాధికారు కుమార్తె. ఒబామాతో సాగించిన ప్రేమాయణాన్ని ఆమె డైరీల్లో భద్రపర్చుకుంది. ఇప్పుడు ఆ రహస్య డైరీ పుస్తక రూపంలో రానుంది. ఈ డైరీ ఆధారంగా పుస్తకం రాస్తున్న డేవిడ్ వీరిద్దరి ప్రేమానుబంధంపై లోలోతు వివరాల్ని సైతం వివరిస్తున్నారట. దీంతో వీరి ప్రేమాయణంపై తాజాగా వేడి వేడి చర్చ జరుగుతోంది.

ది వ్యానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్ పుస్తకంలోని కుక్ డైరీల సారాంశంలోని కొన్నింటిని వెలుగులోకి తెచ్చింది. పుస్తకం వివరాల ప్రకారం.. ఒబామా, కుక్‌లు 1983 డిసెంబరులో న్యూయార్క్‌లోని ఈస్ట్ జోన్ విలేజ్‌లో క్రిస్‌మస్ పార్టీలో కలుసుకున్నారు. ఆమె వయస్సు అప్పుడు 25. ఒబామా వయస్సు ఇరవై రెండేళ్లు. ఓ రోజు తామిద్దరం విందు చేసుకున్నామని, ఆయన పడక గదికి వెళ్లి మాట్లాడుకున్నామని, ఆ రాత్రి అక్కడే గడిపానని, అదంతా ఓ తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిపోయిందని కుక్ తన డైరీలో రాసుకున్నారు.

కుక్, ఒబామా 1985లో విడిపోయారు. కాగా న్యూయార్క్, షికాగోలో కూడా తనకు పలువురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని, వారందరి లక్షణాలు కుక్‌లో ఉండేవని ఒబామా తన వద్ద చెప్పినట్లు పుస్తక రచయిత చెబుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+