సూరి అనుచరుడి అరెస్టు, ఆయుధాలు స్వాధీనం

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అభాంగపూర్ గ్రామానికి చెదిన బూర్జుకడి విజయ్‌కుమార్ (26) అలియాస్ విష్ణు మొదట్లో ఫాక్షన్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతడికి స్వస్థలంలో జక్కంగారి అశోక్ కుమార్ అలియాస్ ఆశప్పతో శత్రుత్వంతో ఉంది. హైదరాబాద్ వచ్చిన విష్ణు హతుడైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో కలిసి ఓ హత్యలో పాల్గొన్నాడు. ఈ కిడ్నాప్ కేసులోనూ అతను నిందితుడు.
తన శత్రువు అశోక్ కుమార్‌కు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఆశ్రయమిచ్చాడు. దీంతో విష్ణు మద్దెలచెర్వు సూరి ముఠాలో చేరాడు. సూరి హత్య తర్వాత పారిపోయాడు. సూరి వద్ద ఉన్న సమయంలో అతను మంగలి కృష్ణకు చెందిన రెండు పిస్టళ్లను పొందాడు. సిఐడి అధికారులు భాను కిరణ్‌ను విచారిస్తున్న క్రమంలో విష్ణు విషయం బయటపడింది. కాగా, సూరి హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని విష్ణు చెప్పాడు.
సిఐడి అధికారుల విచారణలో భాను కిరణ్ పలు విషయాలు వెల్లడించాడు. సూరి ముఠాకు సంబంధించిన విషయాలను కూడా అతను వెల్లడించినట్లు సమాచారం. సూరి బూతులు తిట్టడం వల్లనే భరించలేక హత్య చేసినట్లు అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications