బొత్స పేరుతో బెదిరింపు: తీన్‌మార్ నిర్మాతపై ఫిర్యాదు

రౌడీల అండ కూడా తనకు ఉందని చెప్పాడని ఆయన అన్నారు. ప్రీమియర్ షో జరగకపోవడం వల్ల రూ. 48 లక్షలు నష్టపోయినట్లు ఆయన చెప్పారు. గణేష్ కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఎలా సినిమాలు తీస్తున్నారనే విషయంపై సిఐడి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమా విషయంలో కూడా ముందస్తు అధిక ధరలకు టికెట్లు అమ్ముతూ ప్రేక్షకులను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని ఆయన కోరారు..
నిర్మాత గణేష్ ప్రింట్లు సకాలంలో అందించకపోవడంపై తాము ఆర్థిక నష్టపోయామని చెబుతూ సుబ్బారావు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని డిసిపి జాన్ విక్టర్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఈ విషయంలో రాజీ కోసం కుదిరిన ఒప్పందం ప్రకారం గణేష్ రూ. 91.5 లక్షలు ఇవ్వాల్సినా 4 నెలలుగా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.
గణేష్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ దృష్టికి తెచ్చినా తమకు న్యాయం జరగలేదని సుబ్బారావు చెప్పారని, విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, తీన్‌మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. గబ్బర్ సింగ్ సినిమాలోనూ ఆయన హీరోగా చేశారు. ఇటీవలే గబ్బర్ సింగ్ ఆడియో విడుదలైంది.












Click it and Unblock the Notifications