డిజాస్టర్ కా బాప్ అన్నా నువ్..!!

టాలీవుడ్ లో కొత్త కొత్త ఐడియాలతో సినిమాలు తీసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాలు ఆయన తీసినవే. ఆ తర్వాత 2023 లో కీడాకోలా అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. అయితే దర్శకత్వంతో పాటు నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఆయన డైరెక్షన్ కంటే నటుడిగానే ఇటీవల చాలా సినిమాల్లో కనిపిస్తున్నాడు.

తరుణ్ భాస్కర్ తొలిసారిగా 2018 లో మహానటి చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో నటించాడు. అలా సమ్మోహనం, ఫలక్ నామా దాస్, మీకు మాత్రమే చెప్తా, మిడిల్ క్లాస్ మెలోడీస్, సీతారామం, దాస్ కా దమ్కీ, సంతానప్రాప్తిరస్తు, ఓంశాంతి శాంతి శాంతి లాంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన వైవిధ్యమైన నటనతో అలరించేందుకు వచ్చాడు తరుణ్ భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో తాజాగా మే 1 న విడుదలైన చిత్రం 'గాయపడ్డ సింహం'.. అయితే ఏమైందో తెలియదు కానీ తరుణ్ భాస్కర్ తన మ్యాజిక్ ను ఈ మూవీలో చూపించలేకపోయాడు.

తరుణ్ భాస్కర్ కెరీర్ లోనే ఈ మూవీ డిజాస్టర్ అని టాక్ వినిపిస్తోంది. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. తరుణ్ భాస్కర్ యాక్టింగ్, ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి రీ ఎంట్రీ, కింగ్ ఆఫ్ ది ఎంటర్ టైన్ మెంట్ శ్రీ విష్ణు కేమియో, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల స్ఫూఫ్ లతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఇవేవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయని స్పష్టం అవుతోంది. దాంతో ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వస్తోంది. ఓపెనింగ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి హిట్ స్టేటస్ కు చేరుకోవాలంటే కచ్చితంగా రూ. 8 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

GaayapaddaSimham First Day Box Office Poor Collections Worldwide as Disaster Talk Gains Traction

కానీ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ని చూస్తుంటే.. ఫుల్ రన్ లో కనీసం 50 శాతం కూడా రీకవరీ అయ్యేలా కనిపించడం లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'గాయపడ్డ సింహం' చిత్రానికి మొదటి రోజున కేవలం 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా ఒక 1 కోటి 23 లక్షల రూపాయిల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. మరి తరుణ్ భాస్కర్ ఈసారైనా మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+