మూడో ఛార్జీషీట్: జగనే తొలిముద్దాయి, కొత్తగా ముగ్గురు

88 పేజీలతో 148 అనుబంధ డాక్యుమెంట్లతో 72 మంది సాక్షుల పేర్లను ఛార్జీషీట్‌లో ప్రస్తావించింది. సిబిఐ ఇప్పటికే మొదటి ఛార్జీషీటుతో పాటు ఇటీవల మొదటి అదనపు ఛార్జీషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలి ఛార్జీషీట్‌లో పదమూడు మందిని నిందితులుగా పేర్కొన్న సిబిఐ తాజా ఛార్జీషీట్‌లో ఆరుగురిని పేర్కొంది.
ప్రతి ఛార్జీషీట్‌లో ఎ-1గా జగన్, ఎ-2గా విజయ సాయి రెడ్డి ఉంటారని గతంలోనే సిబిఐ చెప్పింది. కాబట్టి ఇప్పటి వరకు దాఖలు చేసిన మూడు ఛార్జీషీట్‌లలోనూ వారి పేర్లు మొదటనే ఉన్నాయి. ఇందులో కొత్తగా ముగ్గురి పేర్లను సిబిఐ చేర్చింది. ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డి వైజాగ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలో విశాఖ జిల్లాలో రాంకీ సంస్థకు పరవాడలో 1500 ఎకరాలు కేటాయించినట్లు సిబిఐ తన ఛార్జీషీట్‌లో పేర్కొంది.
జగన్‌కు చెందిన జగతి సంస్థలో రాంకీ సంస్థ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని పేర్కొంది. అందుకు ప్రతిఫలంగా పోలేపల్లి సెజ్‌లో 77 ఎకరాలు పొందిందని తెలిపింది. ఈఆర్ఈఎశ్ రూ.8 కోట్లు, సిడబ్లుసి ఇన్‌ఫ్రా రూ.2 కోట్లు రాంకీ పెట్టినట్లుగా సిబిఐ నిర్ధారించింది. కాగా సిబిఐ ఇటీవల సైబర్ టవర్స్‌లోని రాంకీ సంస్థలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications