ఎస్ఆర్ఎం పేపర్ లీక్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రణీత్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో గల ఇండోసాఫ్ట్ ఇంటర్నేషనల్‌లో పని చేస్తున్నాడు. ప్రశ్న పత్రాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రణీత్‌ను ఓ టీవీ చానెల్ తన కెమెరాలో బంధించింది. సమాధానాల కీతో పాటు ప్రశ్న పత్రం ఇవ్వడానికి ప్రణీత్ 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు డిమాండ్ చేశాడు. టీవీ సిబ్బంది అతన్ని శనివారం రాత్రి మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలోని విద్యార్థులకే కాకుండా చెన్నైలోని విద్యార్థులకు కూడా ప్రణీత్ ఆన్‌లైన్ ద్వారా విక్రయించడానికి ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. లీక్ వార్తలు వెలువడినప్పటికీ మొదట విశ్వవిద్యాలయం పరీక్షను రద్దు చేయలేదు. హైదరాబాదులోని 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వివిధ కేంద్రాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సేతురామన్ పరీక్షను రద్దు చేశారు.
విజయవాడకు చెందిన తన మిత్రుడు జివి రెడ్డి ద్వారా ప్రణీత్ ప్రశ్న పత్రం పొందాడని, ఎస్ఆర్ఎం కళాశాలలోనే చదివిన ప్రణీత్ ఏడాది క్రితం జివి రెడ్డితో స్నేహం చేశాడని, జివి రెడ్డి ప్రశ్నపత్రం సాఫ్ట్ కాపీ సంపాదించి ప్రణీత్‌కు ఇమెయిల్ చేశాడని పోలీసులు వివరించారు. జివి రెడ్డి ఆ ప్రశ్న పత్రం ఎలా సంపాదించడనే విషయం తెలియదని, ఈ విషయంపై చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications