విద్యార్థిని చితకబాదిన బాబా రామ్‌దేవ్ అనుచరులు

Baba Ramdev
భోపాల్: యోగా గురు బాబా రామ్‌దేవ్ అనుచరులు మధ్యప్రదేశ్‌లోని భిందులో ఓ విద్యార్థిని చితకబాదారు. మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం నుంచి మహిళా వేషంలో 2011లో పారిపోయారనే విషయంపై ప్రశ్న వేసినందుకు ఆ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. బింధులోని రాజీవ్ గాంధీ మైదానంలో రెండు రోజుల యోగా శిబిరం ముగింపు సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు సోమవారం చెప్పారు.

అనుచరులు చుట్టిముట్టి ఉండగా ఆడవేషంలో రామ్ లీలా మైదానం నుంచి పారిపోయిన విషయంపై అశుతోష్ పరిహార్ రామ్‌దేవ్‌కు ప్రశ్న వేశాడు. ప్రశ్నలు వేయడం ఆపాలాని పరిహార్‌కు బాబా రామ్‌దేవ్ చెబుతుండగానే అనుచరులు అతన్ని పట్టుకుని కొట్టారు. శాంతిని భంగపరిచాడనే ఆరోపణపై పోలీసులు పరిహార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హరిహార్‌పై ఏ విధమైన క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని పోలీసులు విడుదల చేశారు. ప్రీ మెడికల్ టెస్టుకు సిద్ధమవుతున్న పరిహార్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. పరిహార్ శాంతిని భంగపరుస్తాడేమోనని, అనుచరులు అతన్ని చితకబాదుతారేమోనని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మొరెనా జిల్లాలోని బింధ్ సరిహద్దుల్లో గల మెహగావ్‌లో బాబా రామ్‌దేవ్ సోమవారం ఆ సంఘటనపై మాట్లాడారు. సోమవారం జరిగిన సంఘటన దురవగాహన వల్ల మాత్రమే జరిగిందని, పరిహార్ తన విశ్వ కుటుంబంలో ఒకడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+