బిజెపికి ఝలక్, పార్టీని వీడనున్న గాలి సోదరుడు

ఆయన వ్యాఖ్యలపై సోమశేఖర స్పందించారు. ఈశ్వరప్ప ప్రకటనకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. ఆదివారం గుల్బర్గా పాల యూనియన్ నెలకొల్పిన నూతన ప్యాకేజ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఆయన కర్నాటక పాల సమాఖ్య అధ్యక్షుడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను బిఎస్సార్ పార్టీ తరఫునే బళ్లారి నుండి పోటీ చేస్తానని చెప్పారు. శాసనసభ్యులు ఎవరూ కూడా సంజాయిషీ నోటీసులను పట్టించుకోబోరని అన్నారు. త్వరలో తాను శ్రీరాములు స్థాపించిన బిఎస్సార్ పార్టీలో చేరతానని చెప్పారు. తాను శ్రీరాములు పాదయాత్రకు మద్దతిస్తానని, తాను ఈశ్వరప్పకు సమాధానం ఇచ్చేది లేదని సోమశేఖర కుండబద్దలు కొట్టారు.
కాగా బిజెపి సోమశేఖరతో పాటు మరో ఎమ్మెల్యే టిహెచ్ సురేష్ బాబుకు కూడా నోటీసులు జారీ చేసింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డికి సన్నిహితుడు అయిన శ్రీరాములు బిజెపికి రాజీనామా చేసి, ఇటీవల బిఎస్సార్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన స్వతంత్రంగా బళ్లారి రూరల్ నుండి పోటీ చేసి గెలిచారు. అక్కడ బిజెపి డిపాజిట్ కూడా దక్కించులేక పోయింది.












Click it and Unblock the Notifications