సర్పంచ్‌ను గెలిపించగలవా?:సిఎంకు శంకరరావు సవాల్

తన ప్రెస్ మీట్‌పై ఎవరూ ఆంక్షలు పెట్టలేరని, ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తుతో వెళితే నష్టం జరుగుతుందన్నారు. పార్టీలరహితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన సూచించారు.
కిరణ్‌కు సొంత బలం లేదన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయనను ఎన్నుకోలేదన్నారు. తన తండ్రి చనిపోయిన సానుభూతితో కిరణ్ కుమార్ రెడ్డి ఓసారి గెలిస్తే, కాంగ్రెసు హవాలో రెండుసార్లు గెలిచారన్నారు. ఆయన తన సొంత ఇమేజ్‌తో గెలవలేదన్నారు. సీక్రెట్ బ్యాలెట్ పెడితే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఆయనను తిరస్కరిస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రికి దమ్ముంటే తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. తనకు ఇరవై వేల నుండి ముప్పై వేల మందితో బహిరంగ సభ పెట్టే సత్తా ఉందన్నారు. కిరణ్‌తో కాంగ్రెసుకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. కాగా సోమవారం కూడా శంకర రావు ముఖ్యమంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications