జగన్ పార్టీలోకి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్?

చిరంజీవి రెండో కూతురు శ్రీ.. శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు. శిరీష్ పైన వరకట్న వేధింపుల కేసు పెట్టారు. అతను బెయిల్ తెచ్చుకొని సైలెంటయిపోగా, శ్రీజ తండ్రి వద్దనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గాని, కాంగ్రెసు పార్టీలో గాని చేరాలనే అభిప్రాయంతో శిరీష్ భరద్వాజ్ ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. టిడిపికంటే ఆయన జగన్ పార్టీ వేపే మొగ్గు చూపుతున్నారనే వాదనలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో శిరీష్ జగన్ పార్టీ వైపుకు వెళ్లేందుకే ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు. కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జోరుగా వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి పలువురు నేతలు జగన్ పార్టీలోకి చేరుతున్నారు.
చిరంజీవికి చెక్ పెట్టేందుకు శిరీష్ భరద్వాజ్‌ను కూడా తమ పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరుతో శిరీష్ కు విభేదాల నేపథ్యంలో ఆయనను తీసుకుంటే రాజకీయంగా మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారట. శిరీష్ పబ్లిక్ ఫిగర్ కాకపోయినప్పటికీ విభేదాల నేపథ్యంలో సానుభూతిపరంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారని అంటున్నారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications