కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియాకే:బొత్స, కర్నూలులో ఉద్రిక్తత

కాంగ్రెసు పార్టీ పథకాలను జగన్ తన తండ్రి వైయస్ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెసు అభ్యర్థికి ఓటేస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. అవినీతి సొమ్ము కాపాడుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పలువురు నేతలు చేరుతున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అంటే పూర్తి పేరు చెప్పలేని స్థితిలో వారు ఉన్నారన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా బొత్స సత్యనారాయణ ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రచారం కాస్త ఉద్రిక్తంగా మారింది. బొత్స రోడ్డు షో నిర్వహిస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. బొత్సకు, కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కూడా అందుకు ధీటుగా స్పందించి నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కలుగజేసుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను చెదరగొట్టారు. అనంతరం సాయంత్రం కాంగ్రెసు ఫ్లెక్సీలను వైయస్సార్ కాంగ్రెసు నేతలు తొలగించే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ మరోసారి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జగన్ హంతకులను వెనుకేసుకొని తిరుగుతున్నాడని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు విశాఖపట్నంలో మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీలో ఇప్పటికీ కోవర్టులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు తాను ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాలలో ఇందిరమ్మ రథం పేరుతో ప్రజల్లోకి వెళతానని అన్నారు. మెజార్టీ స్థానాలను కాంగ్రెసు పార్టీయే గెలుచుకుంటుందన్నారు. జగన్‌కు పత్రికా స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications