భర్త మిస్: పార్లమెంట్ వద్ద యువతి అత్మహత్యాయత్నం

పార్లమెంటు ఉన్న విజయ చౌక్ ఏరియా నిత్యం రద్దీగా ఉంటుంది. అందులోనూ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే సభ ఉండటంతో ఇక్కడ నిత్యం హైసెక్యూరిటీ ఉంటుంది. ఇంత హై సెక్యూరిటీ జోన్‌లోనూ సదరు యువతి భవనం దరిదాపుల్లోకి యాసిడ్ బాటిల్‌తో వెళ్లడం గమనార్హం. ఇక్కడ ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమం.
కాగా ఆ యువతి బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ను తాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించారు. వారు వేగంగా ఆమె వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన యువతి భర్త గత కొంతకాలంగా కనిపించడం లేదు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. పోలీసుల తీరుతో తిరిగి విసిగిపోయిన ఆమె పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లి పోయి, మీడియా, పోలీసుల ఎదుట పార్లమెంటు భవనం ముందు యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.












Click it and Unblock the Notifications