విషం కక్కుతున్నారని కిషన్, రాజీనామాపై హరీష్ ప్రశ్న

Harish Rao-Kishan Reddy
వరంగల్: పరకాల ఉప ఎన్నికపై భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బిజెపి బాధ్యత మరింత పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం వరంగల్ జిల్లాలో అన్నారు. పరకాల ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు తథ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగానే పరకాలలో బిజెపి పోటీ చేస్తోందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తెరాసపై విరుచుకు పడ్డారు. గెలుపోటములకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి బాధ్యత వహించాలని టిఆర్ఎస్ చెప్పడం సరికాదన్నారు. బిజెపిపై ఆ పార్టీ విషం కక్కుతోందని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి కొండా సురేఖను గెలిపించేందుకే తెరాస పోటీ చేస్తోందన్నారు. టిఆర్ఎస్ వైఖరి వల్లనే తెలంగాణ ఉద్యమంలో బిజెపి బాధ్యత పెరిగిందన్నారు. తెలంగాణపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.

పరకాల నియోజకవర్గంలోనే ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బిజెపిపై, కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణ మేమే ఇస్తాం మేమే తెస్తా అంటున్న కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ రాజీనామా చేసినప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఆ సమయంలో ఆయన విదేశాలకు ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ వస్తుందని చెప్పిన కిషన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. అలాంటి వ్యక్తి తెలంగాణ తెస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. 2009కి ముందు తెలంగాణ ఉద్యమంలో బిజెపి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బిజెపి రాష్ట్రం ఎందుకివ్వలేదన్నారు. పరకాలలో ఓట్లు అడుగుతున్న బిజెపి ఏవిధంగా తెలంగాణ తెస్తుందో చెప్పాలన్నారు.

కాగా పరకాలలో తాము సర్వే జరుపుతున్నామని, ఎక్కువ మంది ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే తాము అదే పార్టీకి మద్దతు ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు అక్కడ సర్వే చేస్తున్నారని చెప్పారు. సర్వే ఫలితాల తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

సమైక్యవాదులకు పరకాలలో చోటు లేదని చెప్పారు. జెఏసిని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత దూరమవుతోందన్నారు. జెఏసిని విమర్శిస్తున్న టిడిపి తెలంగాణ కోసం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+