జగన్‌ను లొంగదీసుకునేందుకే ఈ తతంగం: నన్నపనేని

Nannapaneni Rajakumari
హైదరాబాద్/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లొంగదీసుకునేందుకే సిబిఐ దర్యాఫ్తు, ఆస్తుల జప్తు తదితరాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి గురువారం అన్నారు. కేంద్రమంత్రి శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరహాలోనే జగన్ తిరిగి కాంగ్రెసు పార్టీ పంచన చేరతారన్నారు.

మమత బెనర్జీ, శరద్ పవార్ కాంగ్రెసుతో విభేదించి సొంత పార్టీ పెట్టుకొని తిరిగి అదే పార్టీతో జతకట్టారన్నారు. అలాగే జగన్ కూడా ఆ పార్టీతో జతకట్టడమో లేక ఆ పార్టీలోకి వెళ్లడమో చేస్తారన్నారు. ఏనాటికైనా వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసులో కలవాల్సిందే అన్నారు. కాంగ్రెసు, జగన్ వేరు వేరు కాదన్నారు. ఇద్దరూ ఒకటే అన్నారు. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. శాసనసభ, పార్లమెంటులలో ఏం జరిగితే అదే చూపిస్తారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని తిరుపతిలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీల నేతలను సంతలో పశువులను కొన్నట్లుగా పార్టీలో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. జగన్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

2జి కుంభకోణం కేసులో అరెస్టు అయిన రాజా సానుభూతితో గెలవాలనుకున్న డిఎంకెకు తమిళనాడులో చుక్కెదురయిందని, అలాగే ఇక్కడ జగన్‌కు భంగపాటు తప్పదని దాడి వీరభద్ర రావు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జగన్‌కు చెందిన చిన్న చిన్న సంస్థలపై చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. భారతి, బ్రాహ్మిణి, సండూరు, సరస్వతీ ఇండస్ట్రీస్, బయ్యారం గనులు తదితర సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+