మంత్రులకు 'జగన్' ఉచ్చు:సబితా విచారణ, అరెస్టంటూ..

దీంతో గురువారం ఉదయం పదకొండు గంటలకు సిబిఐ అధికారులు సబిత ఇంటికి వెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. వివాదాస్పద 26 జివోల గురించి ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద జివోలలో 8 జివోలు సబితనే జారీ చేశారు. దాల్మియా సిమెంట్, రఘురాం సిమెంట్, ఇండియా సిమెంట్, పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపుపై ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
సబితా ఇంద్రా రెడ్డి చెప్పిన సమాధానాల పట్ల సిబిఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీంతో ఆమెను మరోసారి విచారించే అవకాశముందని అంటున్నారు. సిబిఐ ప్రశ్నలతో సబితా ఉక్కిరి బిక్కయ్యారని తెలుస్తోంది. ఆయా సిమెంట్ కంపెనీలకు అనుమతుల వెనుక ఎవరి ప్రమేయముందని సిబిఐ ఆమె నుండి ఆరా తీసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయాలలో భాగంగానే గనుల కేటాయింపు జరిగిందని ఆమె సిబిఐకి తెలిపారని సమాచారం.
మరోవైపు సబితా ఇంద్రా రెడ్డిని గోప్యంగా సిబిఐ విచారించడం, ఆమె సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోసారి విచారించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆమెను సిబిఐ అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సిబిఐ వారి ఆరుగురిని విచారించే అవకాశముంది. మంత్రి మోపిదేవి వెంకట రమణను ఈ నెల 21న సిబిఐ విచారించనుంది. తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మరో మంత్రి ధర్మాన ప్రసాద రావును కూడా మరోసారి ప్రశ్నించనుందని తెలుస్తోంది. కాగా ఈ నెల 28న జగన్‌ను తమ ఎదుట హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications