ఇవ్వాలి: తెలంగాణ కోసం రాజ్యసభలో విహెచ్ కంటతడి

సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్ని విధాలా అన్యాయం జరిగిందన్నారు. చనిపోతున్నా, ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా రాష్ట్రం ఇవ్వరా అని ప్రశ్నించారు. 2009వ సంవత్సరం డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు ఆగాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందే అన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణపై స్పష్టమైన వైఖరి లేదన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విహెచ్ బిజెపి పైనా విమర్శలు గుప్పించారు. అయితే ఆయన ప్రసంగాన్ని బిజెపి అడ్డుకుంది.
ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు బిజెపి మూడు రాష్ట్రాలను ఇచ్చిందని, 2014లో మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. తెలంగాణపై మొదట కాంగ్రెసు తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా విహెచ్ మాట్లాడుతున్న సమయంలో ఆయనకు రేణుకా చౌదరి మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications