దెబ్బతీయలేరు: సీమాంధ్రలో కెసిఆర్‌పై బాబు ధ్వజం

టిడిపిని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదన్నారు. కొందరు సామాజిక న్యాయం పేరిట పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేశారని రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అన్నారు. దొంగలు, దోపిడీదారులకు ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తుందన్నారు.
జగన్‌కు సానుభూతి ఓట్లు వచ్చేలా కాంగ్రెసు పార్టీ ఇప్పుడు చర్యలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఎలాగూ తమ పార్టీ గెలవదని కాంగ్రెసు పార్టీ భావించే, జగన్ గెలుపు కోసం ఇలా చేస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అక్రమార్కులు, అవినీతిపరుల నుండి రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వచ్ఛమైన పాలన కోసం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు.
రాష్ట్రాన్ని దోచుకున్న వారే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపి రామచంద్ర రావు తోడుదొంగలని, కెవిపి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో దొరికిన డబ్బు లెక్క ఇంత వరకు తేలలేదన్నారు.
కాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదటి రోజు పలు నియోజకవర్గాలలో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇరిగెల రాంపుల్లా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రపురంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు తొలి నామినేషన్ వేశారు.












Click it and Unblock the Notifications