టిఎస్సార్ గెలుపుకు మీరు చేయాల్సిందొక్కటే: చిరంజీవి

Chiranjeevi
నెల్లూరు/అనంతపురం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థి టి.సుబ్బిరామి రెడ్డిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి శుక్రవారం అన్నారు. ఆయన నెల్లూరులో కాంగ్రెసు పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టిఎస్సార్ నెల్లూరుకు ఎంతో చేయాలని అనుకుంటున్నారని, అందుకు మీరు చేయాల్సింది ఒక్కటేనని, అదే కాంగ్రెసు పార్టీకి ఓటు వేయడమని చిరంజీవి చెప్పారు.

టిఎస్సార్ విజయం సాధిస్తారనే గట్టి నమ్మకంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకు టిక్కెట్ కేటాయించారని అన్నారు. ప్రజలపై ఆయనకు ఉన్న కమిట్‌మెంట్ ఆయనను తప్పక గెలిపిస్తుందని సోనియా విశ్వషిస్తున్నారన్నారు. ఎంపీగా విశాఖను ఎలా అభివృద్ధి చేశారో సొంత జిల్లా నెల్లూరును ఆయన అలాగే అభివృద్ధి చేస్తారన్నారు. సొంత భూమికి సేవ చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారని చెప్పారు.

టిఎస్సార్‌లా తన పలుకుబడి ఉపయోగించి తమ తమ నియోజవర్గాలకు నిధులు తీసుకు వచ్చే వారు ఎవరూ లేరన్నారు. నెల్లూరును ఎంతో అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారన్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయముందని, ఈ కాలంలోనే ఆయన ఐదేళ్ల అబివృద్ధి చేస్తారని చిరు హామీ ఇచ్చారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రచారం నిర్వహించారు. 2014 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఢోకా లేదన్నారు. గత ఎమ్మెల్యే హయాంలో రాయదుర్గం అభివృద్ధి చెందలేదని, కాంగ్రెసుకు ఓటేస్తే రాయదుర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి స్థానికుడని చెప్పారు. స్థానికుడికి ఓటు వేయాలా స్థానికేతరుడికా అని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.

వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే చేసేందుకే కాపు రామచంద్ర రెడ్డి రాజీనామా చేశారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం, తెరాస, బిజెపితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అవినీతి డబ్బును కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి పదవి కోసం, సిఎం పదవి కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కవుతున్నారన్నారు.

ప్రభుత్వం పథకాలపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటి కట్టుకునే పేదలకు ఇచ్చే నిధులు పెంచామని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అదే తమ ప్రభుత్వం చేసిన తప్పా అని ప్రశ్నించారు. వైయస్ తమ పార్టీ నేత అని, అతనిని తాము ఎప్పుడూ కించపర్చలేదన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డియే ఆయన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. తల్లి వంటి కాంగ్రెసును పడగొట్టాలనుకోవడం తండ్రికి వెన్నుపోటు పొడవడమే అన్నారు. రాహుల్ గాంధీని 2014లో ప్రధానమంత్రిగా పని చేయడమే లక్ష్యంగా వైయస్ పని చేశారన్నారు. వైయస్ పైన కాంగ్రెసు నేతలకు ఎప్పుడూ వ్యతిరేకత లేదనన్నారు. ఆయనను ఎవరైనా విమర్శిస్తే వారికి సమాధానం చెప్పేందుకు మేము ముందుండేవాళ్లమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+